VIDEO: జగ్గయ్యపేటలో ప్రమాదవశాత్తు చెలదగిన మంటలు
NTR: జగ్గయ్యపేటలో ఎన్జీవో కాలనీ వెనుక శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని వ్యవసాయ పొలాలకు చేరడంతో రైతుల పంటలు ప్రమాదంలో పడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.