కనకమహాలక్ష్మి ఆలయంలో అపచారం? సిబ్బందిపై ఫిర్యాదు
విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ సిబ్బంది తీరుపై బీజేపీ ఎస్సీ మోర్చా నాయకురాలు మాధవీలత ఏఈవోకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పవిత్ర అభిషేకాన్ని ఎడమ చేతితో చేస్తూ ఆగమ శాస్త్ర విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.