ఇందిరాగాంధీ జూ పార్కులో వింటర్ క్యాంప్ ముగింపు
VSP: ఇందిరాగాంధీ జూ పార్కులో నాలుగు రోజులపాటు నిర్వహించిన వింటర్ క్యాంప్ ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో పాల్గొన్న పిల్లలకు వన్యప్రాణుల ఆహారపు అలవాట్లు, జీవన విధానాలపై అవగాహన కల్పించారు. ముగింపు కార్యక్రమంలో చిన్నారులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, ఉచిత ప్రవేశ పాస్‌పోర్టు కార్డులు అందజేశారు.