జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్పీకర్

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్పీకర్

VKB: తుఫాన్ ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, రైతులు పొలాల వద్దకు వెళ్లరాదని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.