రవీందర్ మృతి పార్టీకి తీరని లోటు: ఆడే గజేందర్
ADB: బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ మృతి పార్టీకి తీరని లోటని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ పార్థివ దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.