'క్లీన్ కడప-బయో డైవర్సిటీ' పోస్టర్ల ఆవిష్కరణ

'క్లీన్ కడప-బయో డైవర్సిటీ' పోస్టర్ల ఆవిష్కరణ

కడప: ఉక్కాయపల్లెలోని ఎకో పార్క్ అభివృద్ధి కోసం మార్చి 8న ఉదయం 6 గంటలకు 'క్లీన్ కడప-బయో డైవర్సిటీ' పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం మేయర్ సురేష్ కుమార్, కమిషనర్ రాకేష్ చంద్ర ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు.