రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఛైర్మన్

రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఛైర్మన్

NLR: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ వక్స్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే.