పీడీఎస్ బియ్యం పట్టివేత.. ఓ వ్యక్తి పై కేసు

పీడీఎస్ బియ్యం పట్టివేత.. ఓ వ్యక్తి పై కేసు

HNK: నగరంలోని భీమారంలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. కేయూ ఎస్సై కల్యాణ్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తుండగా మసీదు సమీపంలోని ఇంట్లో తూర్పాటి తిరుపతి బియ్యం బస్తాలను లోడ్ చేస్తుండగా గుర్తించారు. మొత్తం 140 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి తిరుపతి పై కేసు నమోదు చేసినట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.