నేడు మెదక్ జిల్లా బంద్‌కు BJYM పిలుపు

నేడు మెదక్ జిల్లా బంద్‌కు BJYM పిలుపు

MDK: నేడు మెదక్ జిల్లాలో భారతీయ జనతా యువ మోర్చా (BJYM) బంద్‌కు పిలుపునిచ్చింది. ఇటీవల హిందూ ఆలయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ, వాటికి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు BJYM నాయకులు తెలిపారు. ఈ ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, జిల్లాలోని ఆలయాలకు భద్రతను పెంచాలని కూడా కోరారు.