VIDEO: 'మెగా రక్తదాన శిబిరం'

KKD: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద పిఠాపురం టౌన్ మెగా అభిమానులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మెగా అభిమానులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.