నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

KKD: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా స్థాయి అధికారులు ఇందులో పాల్గొంటారన్నారు. కలెక్టరేట్‌కు రాలేనివారు మండల స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు.