ఫీజులు చెల్లించి... అండగా నిలిచి..!
MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధన అందిస్తున్న హిందీ ఉపాధ్యాయురాలు సభీహాభాను మంగళవారం దాతృత్వం చాటుకున్నారు. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 22 మంది నిరుపేద విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా ఉపాధ్యాయురాలు ముందుకొచ్చి విద్యార్థులకు ఫీజులు చెల్లించారు.