కాముని చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్

కాముని చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్

HYD: మూసాపేటలోని కాముని చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనథ్ సందర్శించారు. ఈ చెరువు పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని అక్కడి స్థానికులు హైడ్రా కమిషనర్‌కు విన్నవించారు. దోమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. దోమల ఇబ్బంది తలెత్తకుండా గుర్రపు డెక్కను తొలగించాలని, చెరువులోని మురుగు నీటిని బయటకు పంపాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.