కాంగ్రెస్, BRSకు షాకిచ్చిన మరుగుజ్జు మహిళ
TG: జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామ ఓటర్లు కాంగ్రెస్, BRS పార్టీలకు షాక్ ఇచ్చారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీల సర్పంచ్ అభ్యర్థులను కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మరుగుజ్జు మహిళ తిరుపతమ్మను 812 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఆమెకు 1621 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 800 ఓట్లు రాగా, BRSకు 170 ఓట్ల లభించాయి.