'ప్రజా ఉద్యమ ర్యాలీ విజయవంతం చేయాలి'
VSP: GVMC 21వ వార్డులో ఎం.రవి అధ్యక్షతన వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ... వైద్య, విద్య రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందన్నారు. ఈ సంతకాలను సోమవారం ఉదయం 9.30కి జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం వరకు ర్యాలీగా తరలిస్తామని తెలిపారు.