మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే
W.G: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో నరసాపురం సూర్య కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అలాగే జాబ్ మేళాలను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కోరారు.