జిల్లాలో ముగిసిన 'ఆపరేషన్ స్మైల్': SP
SRPT: జిల్లాలో 12వ విడత 'ఆపరేషన్ స్మైల్' విజయవంతమైంది. నెలరోజుల పాటు నిర్వహించిన ఈ తనిఖీల్లో వెట్టిచాకిరి, నిరాదరణకు గురైన 176 మంది చిన్నారులను రక్షించినట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. వీరిలో 56 మంది తెలుగు రాష్ట్రాల వారు కాగా, 120 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు. చిన్నారుల భవిష్యత్తును చిదిమేసే వారిపై 79 కేసులు నమోదు చేశామన్నారు.