జిల్లాలో పదో తరగతి పరీక్ష ప్రశాంతం: డీఈవో

జిల్లాలో పదో తరగతి పరీక్ష ప్రశాంతం: డీఈవో

PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాధికారి శారద ఒక ప్రకటనలో తెలిపారు. 7495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 7485 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 99.9 శాతం హాజరు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.