ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్

ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్

WGL: దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్‌ను మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను, నీటి నాణ్యతను మేయర్ పరిశీలించి నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వేసవికాలంలో ప్రజలు తాగునీటి విషయంలో ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.