5న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాబ్ మేళా

NDL: ఆళ్లగడ్డలోని అనంత డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఈ నెల 5న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అనంత రామ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ జాబ్ నెలలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ, B.Tech, పీజీ పూర్తిచేసిన నిరుద్యోగులు వినియోగించుకోవాలన్నారు.