గురకుల ప్రవేశ పరీక్షకు ఎంపికైన ధనశ్రీ

గురకుల ప్రవేశ పరీక్షకు ఎంపికైన ధనశ్రీ

MNCL: ఇటీవల విడుదలైన గురకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షల్లో జన్నారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ధనశ్రీ ఉత్తీర్ణత సాధించింది. MPPS ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, సీటు సాధించిన ధనశ్రీని పలువురు అభినందిస్తున్నారు. ఈ మేరకు HM బిక్కు ఉపాధ్యాయురాలు సౌందర్య విద్యార్థినిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధిని గురుకులానికి ఎంపిక కావడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.