విజయవాడకు వరద ముప్పు లేదు: ఎమ్మెల్యే

ఎన్టీఆర్: విజయవాడకు వరద ముప్పు లేదని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. 'ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడలోకి భారీ వరద వస్తుందని సోషల్ మీడియాలో కొంతమంది దుష్పచారం చేస్తున్నారు. వెలగలేరు నుంచి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో వరద నీరు కలిసేలా రిటైనింగ్ వాల్ నిర్మించాం. వరదతో ఇబ్బంది లేదు' అని తెలిపారు.