'ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అమరుల త్యాగం మరువలేనిది'

'ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అమరుల త్యాగం మరువలేనిది'

SRPT: ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అసువులు బాసిన అమరుల త్యాగం మరువలేనిదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కందుకూరి సోమన్న మాదిగ అన్నారు. ఆదివారం తిరుమలగిరిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ సాధించడమే మాదిగ అమరవీరులకు నిజమైన నివాళి అన్నారు.