అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
NLG: మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు.