మహిళల భద్రతపై ఎస్సై దీపిక అవగాహన

MHBD: మహబూబాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ముత్యాలమ్మ గూడెం ఆశ్రమ పాఠశాలలో ఎస్ఐ దీపిక విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎమర్జెన్సీ సమయంలో 1930 లేదా 100 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.