కొల్లాపూర్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ హౌస్ అరెస్ట్
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొల్లాపూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరగనున్న పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వస్తుండగా ఆదివారం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు. ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఎస్సై లు, పోలీసులు పహారాలో ఉన్నారు.