లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
కోనసీమ: 'మొంథా' తుఫాన్ నేపథ్యంలో లంక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం కొండకుదురు లంక, అయినవిల్లి లంక, వీరవల్లిపాలెంలో ఎమ్మెల్యే పర్యటించి, ప్రజలకు పలు సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జన సైనికులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు సహాయక చర్యలో పాల్గొనాలని సూచించారు.