ఏప్రిల్ 3 నుంచి 'మీ సేవ' సేవలు బంద్..!

ఏప్రిల్ 3 నుంచి 'మీ సేవ' సేవలు బంద్..!

VKB: సాంకేతిక కారణాల దృష్ట్యా వచ్చే నెల ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 'మీ సేవ' ఆన్‌లైన్ సేవలు నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్వర్ నిర్వహణ, భద్రతా వ్యవస్థల అప్‌డేడ్ పనుల కారణంగా ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు వెబ్ పోర్టల్, డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు.