నిజాయితీ చాటుకున్న కండక్టర్
KMR: డిపోకు చెందిన RTC కండక్టర్ రాజు తన నిజాయితీని చాటుకున్నారు. దుబ్బాక నుంచి KMRకి వస్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌ను మర్చిపోయాడు. దీన్ని గమనించిన కండక్టర్ రాజు ఆ ఫోన్‌ను భద్రపరిచారు. ఫోన్‌కు ప్రయాణికుడు ఫోన్ చేయగా, అది తన వద్ద ఉందని రాజు తెలిపారు. అనంతరం, టికెట్ తీసుకుని డిపోకు వచ్చిన సదరు ప్రయాణికుడికి సిబ్బంది సమక్షంలో ఇవాళ ఉదయం అప్పగించారు.