ఆటోపై విరిగిపడ్డ చెట్టు

VKB: తాండూరు పట్టణంలో గాలితో కూడిన వర్షానికి గ్రంథాలయం ఎదురుగా ఉన్న ఒక చెట్టు విరిగి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై పడింది. ఆటో ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది వెంటనే చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు.