ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత
NRPT: మరికల్ మండల కేంద్రంలోని జల లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఓ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ సుమన్ ఆదివారం రూ.50 వేలను అందజేశారు. ఆలయ అభివృద్ధికి వితరణ చేసిన వారిని అడ్వకేట్ అయ్యప్ప అభినందించారు. దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.