ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ : ఎస్పీ
MBNR: ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ జానకి సోమవారం ఓ ప్రకటనలో అన్నారు. ఓటును కొనడం లేదా అమ్మడం చట్టపరంగా పెద్ద నేరం అని ఆమె హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.