అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ ఫీవర్
WC FINALతో అహ్మదాబాద్‌లో క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. మోదీ స్టేడియంలో 1.3లక్షల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. లగ్జరీ హోటల్ రూమ్ ధరలు ఒక్క రాత్రికే రూ.లక్షకు చేరాయి. హోటళ్లు దొరకక అభిమానులు ఏకంగా హాస్పిటల్ బెడ్లను బుక్ చేసుకోవడం గమనార్హం. 80 ప్రైవేట్ జెట్లు, ప్రత్యేక విమానాలు, రైళ్లతో నగరం కిటకిటలాడుతుంది. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.