గ్రామ స్థాయిలోనే అత్యుత్తమ వైద్య సేవలు: ఎమ్మెల్యే
కోనసీమ: ప్రజలకు గ్రామ స్థాయిలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. అంతర్వేదికర గ్రామ పంచాయతీ దగ్గర రూ.55 లక్షలతో నిర్మించే విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలోనూ విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.