రహదారిపై నిలిచిపోయిన వర్షపు నీరు
CTR: పుంగనూరు - బైరెడ్డిపల్లి రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. పట్టణ సమీపంలోని 50 రాళ్ల మరువ మొదలు పుంగనూరు సరిహద్దు వరకు ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉంది. రోడ్డంతా గోతులు, కొద్దిపాటి వర్షానికే నీరు ఇలా రోడ్డుపైనే నిల్వ ఉంటోంది. ఈ మార్గంలో సింగిరి గుంట, మార్లపల్లి, అరవపల్లి ఉన్నాయి. ఈ రహదారిలో వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతుంటాయి.