'పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమం ఆదర్శనీయం'
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పెదవీడు జడ్పీ పాఠశాల 2004–05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ పాఠశాల విద్యార్థులకు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. వారు రూ.33 వేల విలువైన షూస్, బ్యాడ్జ్‌లు, ఐడీ కార్డులను 135 మంది విద్యార్థులకు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు పి. రాధ పూర్వ విద్యార్థుల దాతృత్వాన్ని ప్రశంసిస్తూ.. వారి సేవ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.