బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి

KMM: రానున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు కోరారు. సోమవారం మణుగూరులోని పీవీ కాలనీ, అంబేద్కర్ పార్క్‌లో మార్నింగ్ వాకర్లను కలిశారు. ఆయన మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవకై వచ్చిన రాకేష్ రెడ్డిని గెలిపించాలన్నారు.