రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లిలో శనివారం రైతన్న మీకోసం కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ప్రజలకు మేలు చేకూరే విధంగా మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టుతుంటే వైసీపీ ప్రైవేటుపరం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.