HYDలో యూపీఎస్సీ పరీక్షలు.. 27 కేంద్రాల్లో ఏర్పాట్లు
HYDలో ఈ నెల 12న జరగనున్న CDS, ఎన్డీయే పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నగరంలోని 27 కేంద్రాల్లో 10,967 మంది అభ్యర్థులు హాజరుకానుండగా ఈసారి 'ఫేస్ అథెంటికేషన్' పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని DRO వెంకటాచారి అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు ఈ-అడ్మిట్ కార్డ్, ID ప్రూఫ్‌తోనే రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.