గ్రామపంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావు బాధ్యతలు
కృష్ణా: కోడూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పీ. మల్లికార్జునరావు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని నెలలుగా నాగాయలంక పంచాయతీ కార్యదర్శి జే. పవన్ ఇంఛార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నాగాయలంక మండలం గణపేశ్వరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న మల్లికార్జునరావు ప్రమోషన్‌పై కోడూరు పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.