స్నానం కోసం వెళ్లి కుంటలో మునిగి ఇద్దరి కవలలు మృతి

స్నానం కోసం వెళ్లి కుంటలో మునిగి ఇద్దరి కవలలు మృతి

KMR: స్నానం కోసం వెళ్లి ఇద్దరు కవలలు మృతి చెందిన సంఘటన కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము, లక్ష్మణ్ (13) కవలలు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం గ్రామ సమీపంలోని కుంటలోకి స్నానానికి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగి మృతి చెందారు.