మార్కాపురం డివిజన్ వర్షపాత వివరాలివే

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్‌లో గత 24 గంటలుగా నమోదైన వర్షపాతం వివరాలను ఆదివారం వాతావరణ శాఖ వెల్లడించింది. మార్కాపురంలో 1.6 మి.మీ, కంభం 4.4 మి.మీ, బేస్తవారిపేట 7.4 మి.మీ, గిద్దలూరు 14.0 మి.మీ, రాచర్ల 3.2 మి. మీ, కొమరోలులో 6.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.