పేదలకు ప్రభుత్వం అండ ఉంటుంది: ఎమ్మెల్యే
Wnp:కొత్తకోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుంత రమణ, గ్రామ అధ్యక్షుడు యాదగిరి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.