రూ. 5 వేలకే ఈ-సైకిల్..!
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణం పరిరక్షణ కోసం రూ.5 వేలకే ఈ-సైకిల్ అందించాలని భావించింది. 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' పథకాల కింద సీఎం సొంత ఇలాక కుప్పంలో మొదటి విడతగా ఈ-సైకిళ్లను అందించాలని నిర్ణయించింది. ఈ సైకిల్ ధర రూ.23,999 కాగా ముందుగా రూ.5 వేలు చెల్లించాలని, మిగిలిన డబ్బులు బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించాలని సూచించింది.