నేడు కాణిపాకం హుండీ ఆదాయం లెక్కింపు

నేడు కాణిపాకం హుండీ ఆదాయం లెక్కింపు

CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు బుధవారం జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆస్థాన మండపంలో లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.