VIDEO: దోమల నిర్మూలలపై అవగాహన

KDP: ప్రజలంతా దోమల వలన వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండి దోమల నిర్మూలనపై అవగాహన కలిగి ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు అన్నారు. సోమవారం మండలంలోని జ్యోతి గ్రామంలో దోమల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమతెరలు వాడి దోమ కుట్టు నుండి రక్షణ పొందాలని ఆయన తెలియజేశారు. డాక్టర్ రంగ లక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.