గోదావరి పుష్కరాలు.. మంత్రి ఆనం సమీక్ష
AP: రానున్న గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. 2017లో జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, సన్నాహాలపై మంత్రి సమీక్షించారు. గోదావరి నదీ పుష్కర స్నానాలు ఆచరించేందుకు 5 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారన్న మంత్రి.. ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు.