వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయాలి: ఎస్సై
SRCL; మహిళలు, విద్యార్థినిలు వేధింపులకు గురైతే షీ టీంను సంప్రదించాలని షీ టీం ఎస్సై ప్రమీల అన్నారు. గంభీరావుపేట మండలం మల్లరెడ్డిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినిలు ఎవరైనా వేధింపులకు గురైతే ఈ నంబర్ 8712656425కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.