ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రిన్సిపాల్
VSP: పెందుర్తి సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నూతన ప్రిన్సిపాల్ అన్నెపు గోపి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గోపి, విద్యా అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.