ఆత్మీయతకు నిదర్శనం ఇఫ్తార్ విందు: మాజీ ఎమ్మెల్యే
WNP: రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి, ఆత్మీయతకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి మదనాపురంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరై, ముస్లిం సోదరులకు పండ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.